Reading Time: < 1 minute
Volkswagen Taigun Facelift Launch On April 9 Features Design Engine Details

Volkswagen Taigun: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానం సంపాదించిన Volkswagen Taigun.. ఇప్పుడు మరింత అత్యాధునిక మార్పులతో.. కొత్త అవతారంలో రాబోతోంది. వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఈ SUV కొత్త వెర్షన్‌ను ఏప్రిల్ 9న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పూణే ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైందని సంస్థ వెల్లడించింది. 2021లో మొదటిసారిగా విడుదలైన టైగన్ భారతదేశంలో మంచి ఆదరణ పొందింది. ఇప్పటివరకు 1.43 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేయబడగా, అందులో సుమారు 30 శాతం వాహనాలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇది భారతదేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని కంపెనీ పేర్కొంది.

టైగన్ డిజైన్‌లో సరికొత్త మార్పులు..
కొత్త టైగన్ డిజైన్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. ముందుభాగంలో లైట్ బార్‌తో అనుసంధానించబడిన స్లీక్ LED హెడ్‌ల్యాంప్‌లు, ప్రకాశవంతమైన వోక్స్‌వ్యాగన్ లోగో, కొత్త గ్రిల్ మరియు స్పోర్టీ బంపర్ ఈ SUVకి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్‌లు, పెద్ద స్కిడ్ ప్లేట్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ దీని స్టైలింగ్‌ను మరింత బలోపేతం చేస్తాయి.

స్టైలిష్ ఇంటీరియల్..
ఇంటీరియర్ విషయానికి వస్తే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. కొత్త అప్‌హోల్స్టరీ, మెరుగైన ఫినిషింగ్‌లు వాహనానికి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. అలాగే పవర్డ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

అత్యాధునిక ఇంజిన్‌
ఇంజిన్ పరంగా కూడా ఈ SUV శక్తివంతంగా ఉంటుంది. 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ సుమారు 115bhp పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 లీటర్ TSI ఇంజన్ 150bhp పవర్, 250Nm టార్క్ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయంలో 1.0 లీటర్ వేరియంట్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.5 లీటర్ వేరియంట్‌కు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ అందించే అవకాశముంది. మొత్తంగా చూస్తే, కొత్త ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్‌తో కొత్త Volkswagen Taigun SUV విభాగంలో మరింత పోటీని పెంచేలా కనిపిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..