Reading Time: < 1 minute
Kiran Abbavaram Production Thimmarajupalli Tv Movie Trailer Release Date

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి జీవనశైలిని ప్రతిబింబించేలా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 9న ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Also Read : Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వంశీకాంత్ రేఖానా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంతో సాగే సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి, అదే బాటలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ట్రైలర్‌తో సినిమా కథాంశంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.