July 12, 2026

Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
Reading Time: < 1 minute
Ss Rajamouli Fast Tracks Varanasi Shoot Mahesh Babus Next Schedule In Kashi

Varanasi Movie Shooting Update: భారతీయ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫాంటసీ-మైథలాజికల్‌ మూవీలో మహేశ్‌ రాముడిగానూ కనిపించనున్నారు. మందాకినిగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న వారణాసి సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై తాజా అప్‌డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వారణాసి మూవీని దర్శక ధీరుడు రాజమౌళి వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్‌ను ఫాస్ట్ ట్రాక్‌లో నడుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం.. తదుపరి షెడ్యూల్ కోసం వారణాసి (కాశీ)కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాశీలో కూడా షూటింగ్‌ను త్వరగా ముగించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశారట. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. మిగతా భాగాన్ని అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read: Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

వారణాసి సినిమాలో మహేష్ బాబు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్, గడ్డంతో రగ్గ్డ్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. 120కిపైగా దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దాంతో అత్యధిక దేశాల్లో రిలీజ్‌ అయిన భారతీయ సినిమాగానూ వారణాసి నిలవనుంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ లొకేషన్లు, స్టార్ కాస్ట్.. కలిసి వారణాసి సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తుతున్నాయి. ఈ చిత్రం ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.