Reading Time: < 1 minute
Trump Warning Iran Strait Of Hormuz 48 Hours Threat Power Plants

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచ మార్కెట్లకు చమురు చేరే ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ పవర్ ప్లాంట్స్‌ను నాశనం చేస్తానని హెచ్చరించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ జలసంధిని సురక్షితం చేయాలని ట్రంప్‌పై స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. “ఈ క్షణం నుంచి సరిగ్గా 48 గంటలు టైమ్ ఇస్తున్నాం. ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా తెరవాలి. లేదంటే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తాం.” అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ట్రంప్ రాసుకొచ్చారు.

READ MORE: Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!

ఇక హోర్ముజ్ జలసంధి అనేది ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న 55 కిలోమీటర్ల వెడల్పు గల ఒక ఇరుకైన జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రం నుంచి వేరు చేస్తుంది. ఇంధన రంగం పరంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత ముఖ్యమైన ప్రాంతం. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన నౌకా రవాణా మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. దీంతో ఈ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేసింది. మరోవైపు.. సంఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించడంతో మరింత ప్రమాదకరమైన దశలోకి వెళ్తున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ హెచ్చరిక వెలువడింది.

READ MORE: Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు