Reading Time: < 1 minute
Chiranjeevi Reviews Ustad Bhagat Singh Pawan Kalyan Performance

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం చిరంజీవి వ్యక్తపరిచిన అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంజాయ్ చేశారు. సినిమాలోని ప్రతి సన్నివేశం తనను ఆకట్టుకుందని, ముఖ్యంగా హరీష్ శంకర్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. కేవలం ఒక అన్నయ్యగా మాత్రమే కాకుండా, ఒక సినీ అభిమానిగా కూడా ఈ సినిమా తనకు ఎంతో కిక్ ఇచ్చిందని ఆయన పేర్కొనడం విశేషం.

Also Read : Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్‌’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!

ఈ సినిమాలో ముఖ్యంగా రెండు పాటల గురించి మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగాస్టార్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే వాన వాన వెల్లువాయే క్లాసిక్ సాంగ్‌ను ‘ఉస్తాద్’లో రీమిక్స్ చేసిన విధానం చూసి ఆయన ఫిదా అయ్యారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గ్రేస్ చూసి ఆయన ఎంతో ముచ్చటపడ్డారు. ఈ మనసే మెలోడీ సాంగ్ మరియు దాని పిక్చరైజేషన్ చూసి చిరంజీవి మంత్రముగ్ధులయ్యారు. పాట వస్తున్నంత సేపు ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, దర్శకుడు హరీష్ శంకర్‌ను మరియు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను చిరంజీవి అభినందించారు. చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారని ఆయన ప్రశంసించారు. మెగాస్టార్ ప్రశంసలతో చిత్ర బృందం ఒక్కసారిగా రెట్టింపు ఉత్సాహంలో మునిగిపోయింది.