Reading Time: < 1 minute
Tollywood Stars Support Dhurandhar But Ignore Pawan Kalyan Ustaad Bhagat Singh

ఈ గురువారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో ఉస్తాద్ భగత్ సింగ్.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ధురంధర్.. ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ 2 భారీ హైప్ తో రిలీజ్ అయింది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఎక్కడ చూసిన ధురంధర్ 2 హైప్ కనిపించింది. అయితే కేవలం రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ వాయిదా పడడంతో కాసింత డిజప్పోయింట్ అయ్యారు.

Also Read : Dhurandhar The Revenge : ధురందర్ 2 పై టాలీవుడ్ స్టార్స్ ప్రశంసల జల్లు

ఇదిలా ఉండగా ధురంధర్ 2 సినిమా అద్భుతమని టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ ప్రశంసిస్తూ ట్వీట్స్ చేసారు. విజయ్ దేవరకొండ, బెల్లంకొండ వంటి యంగ్ హీరోలు కూడా ధురంధర్ 2 కు జై కొట్టాలని ఎక్స్ లో పోస్ట్ లు వేశారు. ఒకవైపు హిందీ సినిమాపై ఇంతలా ప్రేమ చూపిస్తున్న హీరోలు అదే సమయంలో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ధురంధర్ కు పోటీగా భారీ అంచనాలతో వచ్చిన ‘ఉస్తాద్’ గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పరాయి భాషా చిత్రాలను ఎంకరేజ్ చేయడం మంచిదే కానీ మన సొంత హీరోలు మరియు సినిమాల విషయంలో కూడా అదే ఉత్సాహం చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.