Reading Time: < 1 minute
Weather Update Rains Lightning Alert Ap Telangana

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు ఇటు తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘బిగ్ అలర్ట్’ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్‌ విడుదల..

ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా , బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు , గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మరోవైపు తెలంగాణలోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!