Reading Time: < 1 minute
Gold Silver Price Drop Reasons Mcx Hyderabad Market Updates

ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు మొగ్గు చూపుతారు.

ఈ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అదే ప్రభావం భారత మార్కెట్‌పైనా పడింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయి లక్షల్లో తగ్గింది. బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Also Read:Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ బలంగా కొనసాగితే ఇంకా కొంతకాలం ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో బంగారం మళ్లీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెరగవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వెండి కిలో ఎంసీఎక్స్ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ కాంట్రాక్ట్‌కు సంబంధించి ఒక్క రోజులోనే వెండి కిలో రూ.19 వేలు తగ్గి రూ.2.29 లక్షలకు చేరింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ నెల డెలివరీ దాదాపు రూ.6 వేలు తగ్గి రూ. 1.46 లక్షలకు చేరింది.