July 12, 2026

SRK : యాక్షన్ జోనర్‌కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్

SRK : యాక్షన్ జోనర్‌కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్
Reading Time: < 1 minute
Shah Rukh Khan To Quit Action Movies King Khan Shifts Focus To Mature Romance With Farah Khan

జీరో డిజాస్టర్ తర్వాత కేవలం క్యామియో పాత్రలకు పరిమితమైన షారూఖ్ ఖాన్.. 2023లో తన పవర్ చూపించాడు. పఠాన్, జవాన్ బాక్సాఫీస్ ఊచకోత కోశాయి. టూ ఫిల్మ్ వెయ్యి కోట్ల మార్క్ దాటాయి. డంకీతో కూడా మరో థౌజండ్ క్రోర్ కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే రెబలోడి సలార్ దెబ్బకు డంకీ డీలా పడింది. సలార్ కలెక్షన్లతో పోల్చితే.. డంకీ వసూళ్లు డల్ అయ్యాయి. ఈ దెబ్బతో బాద్ షా మళ్లీ గ్యాప్ తీసేసుకున్నాడు.

Also Read : JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

డంకీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని నెలల్లో ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఇక ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరడంతో కొత్త కథలు వింటున్నాడట బాద్ షా. ఇప్పటికే ఫరాఖాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు షారూఖ్. మైహూనా 2 అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. గతంలో ఈ కాంబోలో త్రీ ఫిల్మ్స్ రాగా.. అన్నీ సూపర్ డూపర్ హిట్సే.  60 ఏళ్లలోకి అడుగుపెట్టిన షారూఖ్.. ఇకపై యాక్షన్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఒళ్లు హూనం చేసుకునే క్యారెక్టర్ట్‌కు బ్రేక్ ఇచ్చి రొమాంటిక్ డ్రామాలు చేయాలనుకుంటున్నాడట. అయితే తన ఏజ్ దృష్టిలో పెట్టుకుని మెచ్యూర్డ్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ కంటెంట్ ప్రాజెక్ట్‌కు యస్ చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. ఫరాఖాన్ మూవీతో పాటు మరో బిగ్ బడ్జెట్ రొమాంటిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ నుండి ఫరా మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. నెక్ట్స్ ఇయర్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి వెళ్లనుందని బీటౌన్ టాక్. ఇప్పటి వరకు తీసుకున్న రెస్ట్ చాలనుకున్న కింగ్ ఖాన్.. ఇకపై మరింత బిజీ కాబోతున్నాడు.