Reading Time: < 1 minute
Ap Job Calendar 2026 Released 10060 Posts Announced Full Notification Schedule Out

AP Job Calendar 2026 Released By Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించగా.. వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఉగాది పర్వదినాన మంత్రి నారా లోకేశ్ ఈ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు.

జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల మరియు ఇంటర్ విద్యా శాఖల్లోనే అత్యధికంగా 3004 పోస్టులు ఉన్నాయి. హోమ్ శాఖలో 2778 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఉన్నత విద్యా శాఖలో 1500 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1 కింద 91 పోస్టులు, గ్రూప్-2 కింద 750 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులు ప్రకటించారు. ఇతర శాఖల్లో 928 పోస్టులు ఉండగా.. అదనంగా మరో 506 పోస్టులు కూడా ఈ క్యాలెండర్‌లో ఉన్నాయి.

Also Read: Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

ఇక విభాగాల వారీగా చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్‌లో 3004 పోస్టులు, హోమ్ శాఖలో మొత్తం 3057 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 1500 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 452 పోస్టులు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి విభాగంలో 328 పోస్టులు, వాటర్ రిసోర్సెస్ శాఖలో 224 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో 169 పోస్టులు, అడవులు మరియు పర్యావరణ శాఖలో 140 పోస్టులు భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1 (91 పోస్టులు), హోమ్ శాఖ (2778 పోస్టులు), ఇతర శాఖలు (928 పోస్టులు)కు సంబంధించిన నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ (3004 పోస్టులు)కు మే 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్-2 (750 పోస్టులు), ఇంజనీరింగ్ (503 పోస్టులు), ఇతర పోస్టులు (506)కు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయం యువతలో కొత్త ఆశలను నింపింది.