Reading Time: 2 minutes
Cm Revanth Reddy Key Comments In Telangana Assembly Sessions

బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిభింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ ను ఆవిష్కరిస్తూ… రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకం అని కొనియాడారు. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని సీఎం రేవంత్ తెలిపారు.

Also Read:Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన

2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని అనుకున్నామని రేవంత్ చెప్పారు. కొత్త గవర్నర్ కు శుభాకాంక్షలు చెబుతారని భావించాం.. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు అని అసహనం వ్యక్తం చేశారు.

రాజులు పోయినా, రాజ్యాలు పోయినా.. కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదన్నారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు.. ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారు.. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారు. ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.

డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని తెలిపారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారు.. సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు.. ఆయన తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ దేశం ఈ పరిస్థితుల్లో ఉంది.. మొదటి తరంలో నెహ్రూ- ఇందిరా గాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారని తెలిపారు.

సరళీకృత విధానాలతో దేశ ఆర్ధిక గతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావుది అని వెల్లడించారు. 1990 నుంచి 2020 వరకు 30 ఏండ్లు పీవీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. భవిష్యత్ లో AI సునామీ రాబోతుంది.. దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ ను గవర్నర్ గారి ప్రసంగంలో వివరించారు.. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను కనీసం చదివారా? చూశారా.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు అని తెలిపారు.

Also Read:PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

ఇది నవశకానికి నాంది పలకాల్సిన సమయం. అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆలోచన లేదు.. అందుకే ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు.