Reading Time: < 1 minute
Bmw M2 Cs Launched In India 0 100 Km H In 3 8 Seconds

బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్‌ఫుల్ M2 వెర్షన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్‌తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో భారతదేశానికి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అలాట్ చేశారు. ఎంతో మంది ఎంథూజియాస్ట్‌లు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కారు శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది.

Also Read:100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

తయారీదారు విడుదల చేసిన ఈ వాహనంలో LED లైట్లు, LED DRLలు, 19, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, డబుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, కార్బన్-ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన అనేక భాగాలు, ప్రీమియం ఇంటీరియర్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 అంగుళాల కర్వ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 14-స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, క్రూయిజ్ కంట్రోల్, ISOFIX చైల్డ్ యాంకరేజ్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Also Read:Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!

BMW ఈ కారుకు 3-లీటర్ల ఇంజన్‌ను అమర్చింది, ఇది 530 హార్స్‌పవర్, 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్టంగా 302 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది, ఇది M డ్రైవర్స్ ప్యాకేజీతో స్ట్రాండర్డ్ గా వస్తుంది. ఈ కారును తయారీ సంస్థ భారతదేశంలో రూ. 1.66 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.