Reading Time: < 1 minute
Dhurandhar 2 Premieres Content That Has Not Yet Reached Theaters Chances Of Shows Being Canceled

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 19న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుండగా నేడు సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూ షోలను ప్లాన్ చేశారు. అయితే, షోలు ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ, కంటెంట్ డెలివరీ విషయంలో నెలకొన్న ఆటంకాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.

Also Read : Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ చిత్ర బృందం చివరి నిమిషంలో సెకండ్ హాఫ్‌లో కొన్ని కీలకమైన రీ-ఎడిట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగా సినిమా పూర్తి కంటెంట్ ఇంకా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు చేరలేదని సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు ఇండియాలోని కొన్ని కీలక ప్రాంతాల్లో సెకండ్ హాఫ్ ఫైల్స్ ఇంకా అందకపోవడం గమనార్హం. ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టమ్ ఉన్న థియేటర్లకు కంటెంట్ త్వరగా చేరే అవకాశం ఉన్నప్పటికీ, హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే లొకేషన్లలో షోలు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరిగాయి. సాయంత్రం 5 గంటల పెయిడ్ ప్రివ్యూ షోలకు వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే, కంటెంట్ డెలివరీలో జరుగుతున్న ఈ జాప్యం తెలుగు వెర్షన్‌పై కూడా ప్రభావం చూపేలా ఉంది. ఒకవేళ నిర్ణీత సమయానికి కంటెంట్ అందకపోతే, షోలు ఆలస్యమవ్వడమో లేదా రద్దు కావడమో జరగవచ్చు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు ఏదైనా ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్’ ప్లాన్ చేస్తోందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4 గంటల నిడివితో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ అడ్డంకులను అధిగమించి సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందో లేదో వేచి చూడాలి.