Reading Time: < 1 minute
Trump Cuba Darkness Electricity Cut Target

క్యూబాను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇరాన్ తర్వాత తమ టార్గెట్ క్యూబానే అని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా క్యూబాలో అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన

క్యూబాపై అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ద్వీప దేశంపై చమురు ఆంక్షలు విధించింది. ఇతర దేశాలు కూడా సరఫరా చేయకుండా అమెరికా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన నెక్ట్స్ టార్గెట్ క్యూబానే అని తేలిపోయింది. కరేబియన్ దేశంతో తాను ఏమైనా చేయగలనని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒక రూపంలో క్యూబాను తన నియంత్రణలోకి తీసుకునే గౌరవం తనకు దక్కాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.  ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్‌ను తొలగించడాన్ని అమెరికా అధికారులు చర్చలకు ఒక షరతుగా పెట్టారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై అమెరికా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!