Reading Time: < 1 minute
Summer Heatwave Tips Stay Cool Hyderabad

Summer Heatwave Tips in Telugu : హైదరాబాద్‌లో ఇప్పుడు ఎండ 40 డిగ్రీలు దాటేస్తోంది. రోజూ హీట్‌వేవ్ అలర్ట్ వస్తున్నాయి. వాతావరణ శాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పిన లేటెస్ట్ సలహాల ప్రకారం, చిన్న చిన్న మార్పులతో వడదెబ్బ లాంటి సమస్యలు చాలా తగ్గుతాయి. అందులో బెస్ట్ టిప్స్ రెండు.. లైట్ కలర్ కాటన్ బట్టలు వేసుకోవడం, తలని కప్పుకోవడం.

Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!

లైట్ కలర్ కాటన్ బట్టలు ఎందుకు
చాలా సింపుల్ సైన్స్.. తెలుపు, లైట్ గ్రే, లైట్ బ్లూ లాంటి రంగులు ఎండని తీవ్రతను తగ్గిస్తాయి. అంటే వేడి శరీరంలోకి ఎక్కువ రాదు. నలుపు, డార్క్ రంగులు వేడిని లోపలికి తీసుకుంటాయి, శరీరం ఇంకా వేడెక్కుతుంది. కాటన్ బట్ట గాలి ఆడేలా ఉంటుంది, చెమట త్వరగా ఆరిపోతుంది, శరీరం చల్లగా ఉంటుంది. వదులుగా ఉండే బట్టలు వేసుకుంటే గాలి సులభంగా తిరుగుతుంది. హైదరాబాద్ లాంటి తేమ ఎక్కువ ఉండే చోట్ల ఇది సూపర్ వర్క్ అవుతుంది. ఇలా చేస్తే వేడి వల్ల వచ్చే సమస్యలు సగం కన్నా ఎక్కువ తగ్గుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

తల కప్పుకోవడం ఎందుకు
తల, మెడ భాగాలపై ఎండ నేరుగా పడుతుంది. అక్కడి నుంచే వడదెబ్బ సులభంగా వస్తుంది. అందుకే హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.. “తలని కప్పుకోండి.. ఛత్రి, టోపీ, క్యాప్, టవల్ ఏదైనా ఉపయోగించండి.” వెడల్పాటి టోపీ లేదా మెష్ ఉన్న క్యాప్ తీసుకుంటే వేడి బయటికి పోతుంది. ఊళ్లలో ఛత్రి తీసుకెళ్తే చాలా బాగుంటుంది.. ఎండ నుంచి పూర్తి కవర్ ఇస్తుంది. స్కార్ఫ్ లేదా టవల్ కూడా సరిపోతుంది. ఇలా చేస్తే శరీరం ఓవర్ హీట్ అవ్వదు.  ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సేపు బయటకు రావకపోవడం మంచిది.. ఇప్పుడు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగున్న నేపథ్యంలో ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే సేఫ్‌గా, కూల్‌గా ఉండొచ్చు.