Reading Time: < 1 minute
Us President Donald Trump Expresses Deep Dissatisfaction As Nato Allies Including Germany Italy And Spain Refuse To Send Naval Forces To The Strait Of Hormuz Trump Asserts Us Military Supremacy Ami

Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై ఆగ్రహంతో ఉన్నారు. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిపించడానికి మిత్రదేశాలు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ట్రంప్ పిలుపుకు ఏ ఒక్క మిత్రదేశం కూడా అనుకూలంగా లేదు. ఈ పరిణామం తర్వాత ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యూహాత్మక జల మార్గాన్ని సురక్షితం చేయడానికి అమెరికాకు ఎలాంటి సహాయం అవసరం లేదని అన్నారు.

Read Also: India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్‌ చరిత్ర..!

“మాకు ఎవరి సహాయం అవసరం లేదు. మేము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం మాదే,” అని అన్నారు. మిత్ర దేశాలు నాటో కూటమిలో ఉన్నప్పటికీ అమెరికాకు సహాయం చేయరని విమర్శించారు. యూకే నుంచి తమకు ఆలస్యంగా సహాయం అందిందని చెప్పారు. ట్రంప్ మిత్ర దేశాలకు ఇచ్చిన పిలుపుపై స్పందించిన జర్మనీ, స్పెయిన్, ఇటలీలతో సహా అమెరికాకు చెందిన పలు కీలక భాగస్వామ్య దేశాలు.. తమ నౌకాదళ బలగాలను పంపే తక్షణ ప్రణాళికలు లేవని చెబుతూ ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించాయి. యుద్ధాన్ని ప్రారంభించే ముందు అమెరికా కానీ, ఇజ్రాయిల్ కానీ తమకు సమాచారం అందించలేదని జర్మనీ చెప్పింది.