Reading Time: < 1 minute
Vetrimaaran Is The Brand Director For Realistic Films

వెట్రిమారన్ కొత్త సినిమా అరసన్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. రియలిస్టిక్ స్టోరీలు, బలమైన స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన వెట్రిమారన్ నుంచి మరో పవర్‌ఫుల్ సినిమా రాబోతుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. TR సిలంబరసన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినా… ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Also Read : Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే

ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి, భారీ విజయాన్ని సాధించిన వడ చన్నై… 2018లో విడుదలై గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వడ చెన్నై 2 గురించి కూడా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు దాని సీక్వెల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని దర్శకుడు చెప్పడంతో… ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.  తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హిట్ కాంబినేషన్ దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ ది . ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన పొల్లాధవన్, ఆడుకాలం, వడా చెన్నై, అసురణ్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు వడా చెన్నైకి సీక్వెల్‌గా ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. వరుసగా హిట్ సినిమాలు అందించిన ఈ జోడీ… ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు వెట్రిమారన్ నుంచి వచ్చే ఈ రెండు ప్రాజెక్ట్స్‌పై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అరసన్ తో కొత్త కథను తీసుకొస్తుండగా… మరోవైపు కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వడా చెన్నై కి సీక్వెల్‌గా వడా చెన్నై 2 ప్రకటించబోతున్నట్లు చెప్పడంతో తమిళ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.