July 12, 2026

AI Deepfake Scam: నిర్మలా సీతారామన్ ‘AI’ వీడియోతో నమ్మించి.. వృద్ధురాలికి రూ. 87 లక్షల కుచ్చుటోపీ!

AI Deepfake Scam: నిర్మలా సీతారామన్ ‘AI’ వీడియోతో నమ్మించి.. వృద్ధురాలికి రూ. 87 లక్షల కుచ్చుటోపీ!
Reading Time: 2 minutes
Ai Deepfake Scam Using Nirmala Sitharaman Video Cheats Elderly Woman Of 87 Lakh In Hyderabad

AI deepfake scam: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త స్కామ్స్ తో ప్రజల వద్ద నుండి డబ్బులు లాగేస్తున్నారు. తాజాగా దేశ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియోను చూసి నిజమని నమ్మిన ఓ వృద్ధురాలు ఏకంగా రూ. 87.96 లక్షలు పోగొట్టుకున్న ఘటన మల్కాజిగిరిలో వెలుగుచూసింది.

Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

అసలేం జరిగిందన్న విషయానికి వెళితే.. బాధిత వృద్ధురాలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి వివరిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో ఆమె కంటపడింది. అది ఏఐతో సృష్టించిన నకిలీ వీడియో అని తెలియని ఆమె, సాక్షాత్తు మంత్రి గారే చెబుతున్నారు కదా అని నమ్మి ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేశారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. బాధితురాలికి వాట్సాప్ కాల్స్ చేసి తాము పెద్ద ట్రేడింగ్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ‘ట్రేడ్ యాప్’ (TradeApp) అనే ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఇందుకోసం ఆమె ఐడీ ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇక అంతే వారి అసలైన ప్లాన్ అమలు చేశారు. మొదట నమ్మకం కలిగించడానికి కేవలం రూ. 60 వేలు ఇన్వెస్ట్ చేయించారు. ఆ తర్వాత లాభాలు వస్తున్నట్లు నకిలీ గ్రాఫిక్స్‌ తో స్క్రీన్‌ పై చూపించి.. దఫదఫాలుగా మొత్తం రూ. 87.96 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.

Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

తన అకౌంట్‌లో భారీగా డబ్బు కనిపిస్తుండటంతో, బాధితురాలు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సాంకేతిక కారణాలు చెప్తూ కేటుగాళ్లు ఆమెను అడ్డుకున్నారు. ఎంత ప్రయత్నించినా డబ్బు చేతికి రాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ డబ్బు ఏ అకౌంట్ల లోకి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి అనుమానాస్పద లింక్స్ లేదా కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.