Reading Time: < 1 minute
Raashii Khanna Speech Pawan Kalyan Dream Come True Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సూపర్ హిట్ చిత్రం తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మార్చి 19వ ఉగాది కానుగా థియేటర్లలో రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది.

READ ALSO: AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

ఈ వేడుకలో పాల్గొన్న హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తో తెరను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. ఈ సినిమా గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది.” అన్నారు.

READ ALSO: Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల