Reading Time: < 1 minute
Priya Darshi Suyodhana Movie Teaser Review Suspense Thriller

Suyodhana Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుయోధన’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “ఇదొక రియల్ స్టోరీ వరుణ్” అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. ఒక వ్యక్తికి ఎవరో ‘దుర్యోధనుడిలా’ కనిపిస్తున్నాడనే విచిత్రమైన పాయింట్‌తో కథ సాగుతున్నట్లు అర్థమవుతోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనికి, ప్రియదర్శిక ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సస్పెన్స్‌గా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి చాలా సీరియస్ రోల్‌లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఒక మిస్టరీని ఛేదించే వ్యక్తిగా ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.

READ ALSO: Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వై.ఎస్.మాధవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, బోసు బాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి ‘సుయోధన’ టీజర్ చూస్తుంటే ప్రియదర్శి ఈసారి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో యాక్టర్ సాయికుమార్, తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

READ ALSO: Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!