Reading Time: < 1 minute
Durandhar The Revenge Biggest Movie Release Of 2026 Global Theatrical Opening On March 19

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్‌లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో నిర్మించిన ధురంధర్ ది రివెంజ్, హై-ఆక్టేన్ థియేట్రికల్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, స్లిక్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా, గూఢచర్యాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ స్పై-యాక్షన్ థ్రిల్లర్ ఇంటెన్స్ యాక్షన్, గ్రిప్పింగ్ రివెంజ్ తో అంచనాలు పెంచుతోంది. ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో విలన్‌గా, అలాగే సంజయ్ దత్ ఎస్‌పీ చౌధరి అస్లంగాపవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

Also Read:Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంగా, ఈద్‌కు ముందు ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో విడుదల కానుంది. అజ్ఞాత వీరుల కథ ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది.