Reading Time: < 1 minute
Nanis Massive Lineup Natural Star Teams Up With Hit Director Venky Atluri After Sujeeths Movie

వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు నాని. “ది ప్యారడైజ్” తర్వాత నాని, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే భారీ యాక్షన్ డ్రామా చేయనున్నారు. ‘సాహో’, ‘ఓజీ’ వంటి సినిమాలతో తనదైన స్టైలిష్ మేకింగ్‌తో ప్రూవ్ చేసుకున్న సుజీత్, నానిని సరికొత్తగా చూపించబోతున్నాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Also Read: NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?

ఇక ‘బ్లడీ రోమియో’ తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసినట్లు సమాచారం. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ, నాని బాడీ లాంగ్వేజ్‌కు తగిన ఒక బలమైన కథను సిద్ధం చేశారట. ఇప్పటికే నాని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి, సూర్యతో ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నాని ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా.. నాని చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి.

Also Read: Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!