Reading Time: < 1 minute
Shankar Velpari Dhanush Vicky Kaushal Indian 3 Issues Producer Struggles

Director Shankar: శంకర్ కి ఉన్న తలనొప్పులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. నిజానికి ఆయన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ సినిమాల దారుణమైన డిజాస్టర్ రిజల్ట్ తర్వాత, ‘వేల్పరి’ అనే తన జీవితకాల డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. కానీ, ఆ సినిమాకి ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంది. సుమారు రెండున్నర నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భారీ సెట్లతో పాటు స్పెషల్ VFX చేస్తే గానీ ఈ సినిమా ఒక దారికి రాదు. అయితే, శంకర్ చివరి సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాత, ఈ సినిమాకి ఎవరూ నిర్మాతగా ముందుకు రావడం లేదు. దానికి తోడు ‘ఇండియన్ 3’తో ఆయనకి కొన్ని లీగల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటే గానీ, ఆయన తదుపరి సినిమా మీదకు వెళ్లే పరిస్థితి లేదు.

READ MORE: Donald Trump: “నాకు ఇండియా అంటే ఇష్టం.. మోడీ నా బెస్ట్ ఫ్రెండ్”.. భారత్ ప్రజలకు ట్రంప్ స్పెషల్ మెసేజ్!

ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ హీరోలను కూడా భాగం చేయాలని చూస్తున్నారు. వారి డేట్లు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, వారికి కథ కూడా నచ్చాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉండడంతో నిర్మాతలు ఎవరూ శంకర్ సినిమా మీద ఆసక్తి చూపించడం లేదు. అయితే, ఈ సినిమాలో ధనుష్ లీడ్ రోల్‌లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక, రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించాలని కూడా శంకర్, ధనుష్‌ని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో కీలక పాత్ర కోసం విక్కీ కౌశల్‌ని కూడా శంకర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. శంకర్‌కి నిర్మాతలు దొరికితే తప్ప ఈ సమస్యలన్నీ క్లియర్ కావు; ముఖ్యంగా ‘ఇండియన్ 3’ ఇష్యూస్ క్లియర్ అవ్వకపోతే నిర్మాతలు దొరికే అవకాశం కనిపించడం లేదు.

READ MORE: చిన్నారుల భద్రత కోసం WhatsApp కొత్త ఫీచర్.. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్‌డ్ అకౌంట్స్’ షురూ..!