July 11, 2026

Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!
Reading Time: 2 minutes
Why Axar Patel Called Bapu Indian Cricket

Axar Patel Bapu Nickname: టీ20 వరల్డ్ కప్పులో భారత్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే, సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికాతో పోరుకు అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అతడు భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడిపోయింది. ఇక ఫైనల్‌లో అక్షర్ ఇరగదీశాడు. ఇప్పుడే కాదు.. 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఇవి పక్కన పెడితే సోషల్ మీడియాలో అందరూ అక్షర్‌ను “బాపు” అని పిలుస్తారు. ఇంతకీ బాపు అనే పేరు అక్షర్ పటెల్‌కు ఎందుకు వచ్చింది? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

అక్షర్ గాంధీజీ సొంత రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో అక్షర్‌ను అంతా ప్రేమగా ‘బాపు’ అని పిలుచుకుంటారు. అక్షర్ పటేల్ గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందినవాడు. భారత క్రికెటర్ అక్షర్ పటేల్ 1994 జనవరి 20న జన్మించాడు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న నడియాడ్ (Nadiad) అనే నగరంలో పుట్టాడు. ఇక గాంధీ విషయానికి వస్తే.. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీని ‘బాపూజీ’గా పిలుస్తారు. ఈ బాపు పేరు అక్షర్‌కు వచ్చింది. ఇక అక్షర్‌పై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌, వీడియోలు, మీమ్స్ గురించి పెద్దగా చెప్పనరవసం లేదు. అక్షర్ బాగా రాణిస్తే చాలు ఇక బాపు.. బాపు అంటూ పొగిడేస్తుంటారు.

READ MORE: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

ఇదిలా ఉండగా.. 2024లో జరిగిన వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో మట్టికరిపించి భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్ల పాత్ర ఉన్నప్పటికీ, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా మాత్రం ఒకే ఒక పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. గుజరాత్ బాపు అక్షర్ పటెల్. “ఈ బాపు అహింసను నమ్మడు, ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టడంలో అస్సలు కనికరం చూపడు. బాపు.. నీ బౌలింగ్ ప్రత్యర్థుల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు!” అంటూ ఆకాశ్‌ చోప్రా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.