July 10, 2026

China: ఇరాన్‌కు భారీ సాయం ప్రకటించిన చైనా..

China: ఇరాన్‌కు భారీ సాయం ప్రకటించిన చైనా..
Reading Time: < 1 minute
China Humanitarian Aid Iran War Military Intelligence Allegations

China: మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ యుద్ధం ప్రారంభమై 14 రోజులు గడిచాయి. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్‌లపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేందింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.

Read Also: Kamakhya to Cherlapalli: చర్లపల్లికి మరో ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

ఇదిలా ఉంటే, ఇరాన్‌కు చైనా భారీ సాయాన్ని ప్రకటించింది. 2,00,000 డాలర్ల విరాళంగా అందించనుంది. ఈ నిధులు చైనా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం, ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితుల్ని అధిగమించేందుకు ఈ మానవతా సాయం సహాయపడుతుందని చైనా పేర్కొంది.

మరోవైపు, యుద్ధంలో కూడా చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. చైనా తన తన శాటిలైట్స్ ద్వారా యూఎస్ మిలిటరీ ఆస్తుల వివరాలను అందిస్తోందని పలు కథనాలు వెల్లడించాయి. దీని ద్వారానే ఇరాన్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుందని అనుమానిస్తున్నాయి. ఇదే కాకుండా ఇరాన్ వద్ద ఉన్న మిస్సైల్ టెక్నాలజీకి కూడా డ్రాగన్ కంట్రీ సాయం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.