Reading Time: < 1 minute
Trump Iran Surrender Claim Mojtaba Khamenei Revenge Warning

Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన ప్రతీకారం తీర్చుకుంటోంది. మరోవైపు.. ఇరాన్, యూఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’అని ట్రంప్ G7 దేశాల నాయకులతో అన్నారు. ట్రంప్ తన ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’పై గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పట్టిన క్యాన్సర్‌ను వదిలిస్తాన్నామని మిత్రదేశాలతో ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించి, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చాలని మిత్రదేశాలు ట్రంప్‌ను కోరాయి.

Read Also: LPG BOOKINGS: వంటగ్యాస్‌‌ భయాలు.. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్ల బుకింగ్స్..

ఇదిలా ఉంటే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా, ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం లొంగిపోదని అన్నారు. తన తొలి ప్రకటనలో.. అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన ప్రతీవ్యక్తికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. మా వీరుల రక్తాన్ని మరిచిపోం అని అన్నారు. అమెరికాపై ఒత్తిడి పెంచడానికి హార్ముజ్ జలసంధి మూసే ఉంచుతామని స్పష్టం చేశారు.