Reading Time: < 1 minute
Usman Tariq Birmingham Phoenix The Hundred Auction 2026

Usman Tariq: వింత బౌలింగ్‌తో టీ20 వరల్డ్ కప్‌లో అందరి దృష్టిని ఆకర్శించిన స్పినర్ ఉస్మాన్ తారిక్. అనేక మంది క్రికెట్ అభిమానులు, ప్లేయర్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో తారిక్ బౌలింగ్‌పై ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ప్లేయర్ తాజాగా హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో జాట్‌పాట్ కొట్టాడు. తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (Birmingham Phoenix) ఏకంగా 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు కొనుగోలు చేసంది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 1.72 కోట్లకు అమ్ముడయ్యాడు. తారిక్‌ కోసం ఈ వేలంలో పోటీ నెలకొంది. ఎట్టకేలకు బర్మిగ్ హామ్ ఫీనిక్స్ సొంతం చేసుకుంది. ఇక పాకిస్థాన్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన ఫీనిక్స్‌ ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేలంలో అమ్ముడుపోయిన రెండో పాకిస్థాన్‌ ఆటగాడు తారిక్‌. హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

READ MORE: Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!

ది హండ్రెడ్ గురించి..
ఇక ది హండ్రెడ్ (The Hundred) అనేది ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) నిర్వహించే సరికొత్త100-బంతుల క్రికెట్ లీగ్. ఇది ప్రతి ఇన్నింగ్స్‌కు 100 బాల్స్‌ వేస్తారు. సుమారు 2.5 గంటల పాటు ఈ మ్యాచ్ సాగుతుంది. 8 జట్లతో జరిగే ఈ పోటీ జూలై-ఆగస్టులో నిర్వహిస్తారు. ఈ లీగ్ 2021లో ప్రారంభమైంది. 2026 నుంచి వేలం (Auction) పద్ధతిని ప్రవేశపెట్టారు. నిన్న తొలిసారిగా వేలం జరిగింది.

READ MORE: Abrar Ahmed: పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన ‘సన్‌రైజర్స్’ ఓనర్ కావ్యా.. SRH ఫ్యాన్స్ ఫైర్!