Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

Fuel Update : భారతదేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ , ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వంటి ఇంధన ఉత్పత్తుల లభ్యతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం , సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశీయంగా ఇంధన సరఫరా గొలుసు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధారణంగా సాగుతోందని ఆయన హామీ ఇచ్చారు. గతంతో పోలిస్తే భారత్ తన క్రూడ్ ఆయిల్ దిగుమతి వనరులను గణనీయంగా పెంచుకుంది. 2006-07 సంవత్సరాల్లో కేవలం 27 దేశాల నుండి చమురును సేకరించిన భారత్, ప్రస్తుతం ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచుకుందని మంత్రి వెల్లడించారు.
Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్
అలాగే, హార్ముజ్ జలసంధి వంటి సున్నితమైన ప్రాంతాల గుండా కాకుండా ఇతర మార్గాల ద్వారా చమురు దిగుమతులు 55 శాతం నుండి 70 శాతానికి పెరిగాయని, ఇది మన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసిందని ఆయన వివరించారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) ప్రస్తుతం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఇవి తమ పూర్తి సామర్థ్యానికి మించి, అంటే 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో (Capacity Utilization) ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్లలో సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని, ఇంధన కొరత అనే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు.
Special Force : ఇరాన్ సుప్రీం లీడర్ ను కాపాడుతున్న స్పెషల్ ఫోర్స్