July 10, 2026

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
Reading Time: < 1 minute
Prem Rakshith Master Praised By Vincent Paterson Prabhas Project Buzz

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు ఖండాతరాలను దాటుతోంది, ముఖ్యంగా మన తెలుగు సినిమా పాటలు, వాటిలోని డ్యాన్స్ స్టెప్పులు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రతిభను అంతర్జాతీయ స్థాయి దిగ్గజం గుర్తించడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ కు ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేసిన వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్, మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌ను ప్రత్యేకంగా మెచ్చుకోవడం హాట్ టాపిక్ అయింది. జాక్సన్ పాటలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంలో ప్యాటర్సన్ పాత్ర ఎంతో కీలకం. అలాంటి గ్లోబల్ లెజెండ్ నుంచి ప్రశంసలు రావడం అంటే, ఇండియన్ కొరియోగ్రఫీ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్

ఇక ఈ ప్రశంసల వెనుక ఒక ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందబోయే ఒక భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం విన్సెంట్ ప్యాటర్సన్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కలిసి పని చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం జరుగుతోందనే చెప్పాలి. మైఖేల్ జాక్సన్ స్టైల్, ఇండియన్ మాస్ మ్యాజిక్ కలిస్తే వెండితెరపై విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ.”ఒకప్పుడు మనం హాలీవుడ్ టెక్నీషియన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు వాళ్లే మన టాలెంట్‌ను వెతుక్కుంటూ రావడం మన సినిమా సాధించిన విజయం.” అనే చెప్పాలి.