Reading Time: 2 minutes
Gas Saving Tips How To Make Lpg Cylinder Last Longer

LPG Gas Saving Tips: ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం నేపథ్యంలో LPG గ్యాస్ కొరత సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే.. దీంతో వంట గ్యాస్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అజాగ్రత్తగా గ్యాస్ వాడటం వల్ల సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుంది. అయితే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. నిత్యం మనం చేసే కొన్ని తప్పుల వల్లే గ్యాస్ వృథా అవుతుంది. కింద పేర్కొన్న పద్ధతులు పాటిస్తే సిలిండర్‌ను ఎక్కువ కాలం వాడుకోవచ్చు.

మంటను నియంత్రించండి (Flame Control)
చాలా మంది గ్యాస్ మంటను (Flame) ఎక్కువగా పెడతారు. దీనివల్ల మంట గిన్నె అంచులకు బయటకు వచ్చి గ్యాస్ వృథా అవుతుంది. మంట ఎప్పుడూ గిన్నె అడుగు భాగానికి మాత్రమే తగిలేలా చూసుకోవాలి. ఇది గ్యాస్‌ను ఆదా చేయడమే కాకుండా వంటగదిలో వేడిని కూడా తగ్గిస్తుంది.

Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?

బర్నర్ల శుభ్రత (Burner Cleaning)
గ్యాస్ స్టవ్ మంట నీలి రంగులో (Blue Flame) వస్తుంటే బర్నర్లు శుభ్రంగా ఉన్నాయని అర్థం. ఒకవేళ మంట ఎరుపు లేదా పసుపు రంగులో వస్తుంటే బర్నర్లలో దుమ్ము పేరుకుపోయిందని గుర్తించాలి. వేడి నీరు , బ్రష్‌తో బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల గ్యాస్ సరిగ్గా మండుతుంది.

పొడి పాత్రలనే వాడండి
స్టవ్ మీద గిన్నెలు పెట్టేటప్పుడు అవి తడిగా లేకుండా చూసుకోవాలి. తడి గిన్నెలు పెడితే, ఆ నీటిని ఆవిరి చేయడానికి గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. పొడి గిన్నెలు పెడితే వంట త్వరగా వేడెక్కుతుంది.

ప్రెషర్ కుక్కర్ వాడకం
సాధారణ పాత్రల కంటే ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల ఆవిరి ఒత్తిడికి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇది సమయాన్ని , గ్యాస్‌ను గణనీయంగా ఆదా చేస్తుంది.

నీటి పరిమాణం , నానబెట్టడం
వంటలో అవసరానికి మించి నీటిని పోయకండి. నీరు ఎక్కువగా ఉంటే అది ఆవిరి అయ్యే వరకు గ్యాస్ మండుతూనే ఉండాలి. అలాగే పప్పులు, బియ్యం వంటి వాటిని వండటానికి గంట ముందే నానబెడితే అవి త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల గ్యాస్ వినియోగం తగ్గుతుంది.

Natural Dye Tips: కొబ్బరి పీచుతో తెల్ల జుట్టుకు గుడ్ బై.. రూపాయి ఖర్చు లేని అద్భుత చిట్కా.!