July 10, 2026

JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?

JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?
Reading Time: < 1 minute
Boyapati Srinu In Talks For Jaat 2 With Sunny Deol

టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డైరెక్టర్ అంటే బోయపాటి మాత్రమే. ఆయన తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్స్‌లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. గతేడాది చివర్లో అఖండ 2 తో పలకరించిన బోయపాటి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. అయితే ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనే దానిపై గత కొంత కాలంగా సస్పెన్స్ నెలకొంది. తమిళ్ హీరోతో ఉంటుందని బాలీవుడ్ హీరోతో ఉందని న్యూస్ వినిపించాయి.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ చిత్రం ‘జాట్’ సీక్వెల్ బాధ్యతలను బోయపాటి చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం.

Also Read : Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి బోయపాటి శ్రీను ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు, బోయపాటి మార్క్ ఊర మాస్ యాక్షన్ తోడైతే వెండితెరపై రక్తాభిషేకం గ్యారెంటీ అని మాస్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఈ కథపై కసరత్తు చేస్తున్నారని, సన్నీ డియోల్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. బాలీవుడ్ మరియు టాలీవుడ్ కలయికలో రాబోయే ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.