Reading Time: < 1 minute
Nageddi Srinivas Suicide Case Wife Harassment Neredmet Hyderabad

Hyderabad: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్మేట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్‌ గ్రూప్స్‌ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు భర్త శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు. భర్త సహాయంతో జ్యోతి గ్రూప్స్‌లో విజయం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది. ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అంతే కాదు.. భర్తపై వరకట్నం వేధింపులు, విడాకుల కేసులు పెట్టింది. వేధింపులకు పాల్పడటంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాశాడు. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా అతను మృతిచెందినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం కీలక ప్రకటన..