July 10, 2026

Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!

Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
Reading Time: < 1 minute
T20 World Cup 2026 Gambhir Vs Agarkar Disagreement Over Shubman Gill Selection

Gautam Gambhir vs Ajit Agarkar Disagreement Over Shubman Gill Selection: టీ20 వరల్డ్‌ కప్ 2026 ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి.. పొట్టి కప్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ ఇళ్లకు చేరుకొని వరల్డ్‌ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికొచ్చింది. టీ20 వరల్డ్‌ కప్ జట్టు ఎంపిక సందర్భంగా కీలక చర్చలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా యువ బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఎంపిక విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రిపోర్టుల ప్రకారం.. 2026 టీ20 వరల్డ్‌ కప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పనిసరిగా చేర్చాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. అతని టెక్నికల్ క్లాస్, స్థిరమైన బ్యాటింగ్ టీమ్‌కు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడట. అయితే జట్టు కాంబినేషన్ విషయంలో సెలెక్టర్ అజిత్ అగర్కర్ తన నిర్ణయంను మార్చుకోలేదట. టీ20 ఫార్మాట్‌లో దూకుడైన ఆటగాళ్లు జట్టుకు మరింత ఉపయోగపడతారని అగార్కర్ భావించాడట. అందుకే సెలెక్టర్లు ఇషాన్ కిషన్, రింకూ సింగ్ వంటి హిట్టర్లను జట్టులోకి ఎంపిక చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారట.

Also Read: Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!

సెలెక్టర్ల అభిప్రాయం ప్రకారం శుభ్‌మన్ గిల్ మంచి ఆటగాడే అయినప్పటికీ.. 2026 టీ20 వరల్డ్‌ కప్ జట్టులో ప్రతి ఆటగాడికి ప్రత్యేక పాత్ర అవసరమని భావించారు. ఆ కారణంగానే గిల్ ఈసారి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని సమాచారం. మెగా టోర్నీ ముందు గిల్ ఫామ్ కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామాలు భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గౌతమ్ గంభీర్-అజిత్ అగార్కర్ మధ్య జరిగిన ఈ చర్చ.. టీమ్ సెలక్షన్‌లో ఎంతగా ఆలోచనలు ఉంటాయో స్పష్టంగా తెలుస్తోంది. భారత్ టీ20 వరల్డ్‌ కప్ గెలవడంతో.. అగార్కర్ నిర్ణయం సరైందే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.