Reading Time: 2 minutes
State Bank Of India Specialist Cadre Officer Recruitment 2026 Apply Online For 116 Posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు 124 (సాధారణం 113 + బ్యాక్‌లాగ్ 11). అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు మార్చి 15 చివరి తేది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?

పోస్టుల వివరాలు

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (IS Audit) – కాంట్రాక్టు బేసిస్: Regular – 6, Backlog – 6 → మొత్తం 12
ఏజ్: 27–45 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
CTC: గరిష్టంగా రూ.50 లక్షల వరకు (85:15 fixed + variable)
కాంట్రాక్టు కాలం: 3 సంవత్సరాలు (2 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండ్ చేయవచ్చు)
పోస్టింగ్: ముంబై / హైదరాబాద్ / మొబైల్ డ్యూటీ

డెప్యూటీ మేనేజర్ (IS Audit) – రెగ్యులర్ పోస్ట్, MMGS-II (Pay Scale: 64820-93960)వాకెన్సీలు: Regular – 40, Backlog – 3 → మొత్తం 43
ఏజ్: 25–35 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
పోస్టింగ్: ముంబై / హైదరాబాద్ / మొబైల్ డ్యూటీ

డెప్యూటీ మేనేజర్ (Chartered Accountant – Internal Audit) – రెగ్యులర్ పోస్ట్, MMGS-IIవాకెన్సీలు: Regular – 61, Backlog – 2 → మొత్తం 63 (PwBD హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది)
ఏజ్: 21–35 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
పోస్టింగ్: హైదరాబాద్ సర్కిల్ ఆఫీసులు / ముంబై (మొబైల్ డ్యూటీ సాధ్యం)

ఎలిజిబిలిటీ (క్వాలిఫికేషన్ & ఎక్స్‌పీరియన్స్)

AVP & DM (IS Audit):ఎడ్యుకేషన్: B.E./B.Tech/B.Sc/M.Tech/M.Sc/MCA/BCA (IT/Computer Science లేదా సంబంధిత) – 50% మార్కులతో.
డిజైరబుల్ సర్టిఫికేట్లు: CISA, CISSP, CISM, DISA, ISO 27001, CEH, GIAC వంటివి.
ఎక్స్‌పీరియన్స్: AVP – 6 సంవత్సరాలు (3 సంవత్సరాలు IS Audit/సైబర్ సెక్యూరిటీలో); DM – 3 సంవత్సరాలు (2 సంవత్సరాలు IS Auditలో). BFSI/IT సెక్టార్‌లో ఉండాలి.

DM (CA – Internal Audit):ఎడ్యుకేషన్: Chartered Accountant (ICAI మెంబర్).
డిజైరబుల్: CISA, DISA.
ఎక్స్‌పీరియన్స్: క్వాలిఫికేషన్ తర్వాత 1 సంవత్సరం స్టాట్యుటరీ/ఇంటర్నల్/కన్‌కరెంట్ ఆడిట్ (బ్యాంకులు/CA ఫర్మ్‌లలో). ట్రైనింగ్/టీచింగ్ కౌంట్ కాదు.

రిజర్వేషన్: SC/ST/OBC/EWS/PwBD ప్రకారం. ఏజ్ రిలాక్సేషన్: OBC-3, SC/ST-5, PwBD-10 సంవత్సరాలు (కాంబినేషన్ ప్రకారం మరిన్ని).

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీ పేమెంట్: 23-02-2026 నుంచి 15-03-2026 వరకు.
అప్లై చేయాల్సిన వెబ్‌సైట్: https://sbi.bank.in/web/careers/current-openings → Advertisement No. CRPD/SCO/2025-26/27 సెలెక్ట్ చేసి అప్లై చేయండి.

Also Read:Shahid Afridi: “భారత్ దెబ్బకు వణికిపోయాం”.. పాత గాయాన్ని గుర్తు చేసుకున్న పాక్ దిగ్గజం అఫ్రిది

అప్లికేషన్ ఫీ General/EWS/OBC: రూ.750 (నాన్-రిఫండబుల్) SC/ST/PwBD వారికి ఫ్రీ.

సెలక్షన్ ప్రాసెస్ షార్ట్‌లిస్టింగ్ (క్వాలిఫికేషన్ & ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా)
ఇంటర్వ్యూ (100 మార్కులు)
AVPకు CTC నెగోషియేషన్ ఉంటుంది.
ఫైనల్ మెరిట్: ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా (టైలో ఏజ్ ప్రకారం ర్యాంక్).