Reading Time: 2 minutes
Ipl 2026 Phase 1 Schedule Rcb Vs Srh Opening Match

IPL 2026 Schedule Released : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సందడికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం కీలక ప్రకటన చేసింది. టోర్నీలో భాగంగా మొదటి దశ (Phase-1) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో తొలి పోరులోనే అగ్రశ్రేణి జట్లు తలపడనుండటంతో అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది.

ఈ ఏడాది ఐపీఎల్ వేట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మార్చి 28న రాత్రి 7:30 గంటలకు జరిగే ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో భారీ స్కోర్లతో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్, ఈసారి తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీతో డిఫెండింగ్ ఛాంపియన్ తో తలపడనుండటం గమనార్హం. కేవలం తొలి 20 మ్యాచ్‌లకు సంబంధించి మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ, మిగిలిన దశల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.

Gas Booking Scam : ఫాస్ట్ డెలివరీ అంటూ కేటుగాళ్ల ‘గ్యాస్ బుకింగ్’ లింక్.. క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, తాజా షెడ్యూల్ భాగ్యనగర వాసులను కొంత నిరాశకు గురిచేసింది. విడుదలైన మొదటి దశ షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (RGIS) కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్‌లో తమ జట్టు ఆటను చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మింగుడుపడని విషయమే అయినప్పటికీ, రెండవ దశ షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియానికి మరిన్ని మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉంది.

Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. అలాగే మార్చి 30న గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5వ తేదీ క్రికెట్ ప్రియులకు డబుల్ ధమాకా అందనుంది. మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌హెచ్ vs ఎల్‌ఎస్‌జీ మ్యాచ్ జరుగుతుండగా, అదే రోజు రాత్రి బెంగళూరులో ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది. మొత్తంగా ఏప్రిల్ 12వ తేదీ వరకు జరిగే ఈ మొదటి దశలో అన్ని ప్రధాన జట్లు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

Ipl2026 Schedule