Reading Time: < 1 minute
Chota K Naidu Comments On Caste Vadala Movie Glimpse Launch Viral

Chota K Naidu: టాలీవుడ్‌లో కులం అనేది ఒక అదృశ్య శక్తిలా పని చేస్తుందని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చను మరో కోణంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా కులం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా భార్య చౌదరి, నా అల్లుడు రెడ్డి, నేను కాపు.. ఇక్కడ సినిమాకి కులం లేదమ్మా తల్లీ!” అంటూ ఆయన ఇండస్ట్రీలో కుల భేదాలు లేవని కుండబద్దలు కొట్టారు. సినిమాకు కులం లేదని చెప్పారు. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వదలా’. ఈ చిత్రంలో జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ్‌, కిశోర్‌ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఛోటా కె.నాయుడిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. సినిమాకు కులం లేదని చెప్పారు.

READ ALSO: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!