Reading Time: < 1 minute
Kaala Bhairava To Marry Balagam Actress Kavya Kalyanram

టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ప్రముఖ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఆయన పెసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు.. ‘బలగం’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన అందాల నటి కావ్య కళ్యాణ్ రామ్.

Also Read : Harish Shankar : పొరపాటు జరిగింది.. క్షమించండి ‘మహేశ్ బాబు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. కాలభైరవ కేవలం సింగర్‌గానే కాకుండా ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ‘మసూద’, ‘బలగం’ వంటి హిట్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. కీరవాణి కుటుంబం మరియు కావ్య కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల్లో వివాహ వేడుకకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, త్వరలోనే ఈ జంట తమ పెళ్లి వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త నిజమైతే, టాలీవుడ్‌లో మరో అందమైన జంట ఒకటి కాబోతుందన్నమాట. అక్కినేని, మెగా కుటుంబాల పెళ్లిళ్ల తర్వాత ఇప్పుడు కీరవాణి ఇంట్లో జరగబోయే ఈ వివాహంపై అందరి దృష్టి నెలకొంది. మరి ప్రస్తుతంసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ  వార్తలపై అధికారక ప్రకటన వస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సి.