Reading Time: < 1 minute
Salman Khan Vamshi Paidipally Movie Dil Raju Action Thriller 2026

దళపతి విజయ్‌తో ‘వారసుడు’ సినిమా చేసిన వంశీ పైడిపల్లి చాలా కాలంగా రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. ఆయన ఈ తర్వాత సినిమా ఎవరితో చేస్తారనే విషయంపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే తాజా సమాచారం మేరకు ఆయన ఏకంగా నెక్స్ట్ సినిమా కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్‌కి వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయన వంశీతో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు షూటింగ్ కూడా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read :Ravindra Jadeja: ‘ఖమ్మా ఘనీ’ రాజస్థాన్.. రవీంద్ర జడేజా రాయల్స్ ఎంట్రీ మాములుగా లేదుగా.!

ఈ సినిమాతో పాటుగా సమంత భర్త రాజ్, అతని పార్ట్‌నర్ డీకేలతో కలిసి కూడా సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి చేయబోతున్న సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కొత్త గెటప్‌లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి సల్మాన్ ఖాన్‌కి సాలిడ్ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సౌత్ డైరెక్టర్లతో పనిచేసి సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వంశీ పైడిపల్లి, రాజ్ డీకే కథలకు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.