Reading Time: < 1 minute
Sameera Reddy Comments On Colorism Body Shaming Film Industry Postpartum Weight

సినిమా పరిశ్రమలోని ‘కలర్ డిస్క్రిమినేషన్’ సహా బాడీ షేమింగ్‌పై నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమీరా రెడ్డి, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.తనను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం బాగా ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చింది. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని, ముఖానికే కాక ఎక్కడైతే బయటకు కనిపిస్తుందో అక్కడ శరీరానికి కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆమె తెలిపింది.

Also Read:Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్

అలా వాళ్లు చెప్పడం వల్ల, తాను అంత అందంగా ఉండనేమో అన్న భావన కలిగేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఎత్తు తక్కువగా ఉండటం వల్ల లావుగా ఉందంటూ విమర్శలు చేసేవారని, ఇక్కడ (సినీ పరిశ్రమలో) టాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వడం తనను తీవ్రంగా కలచివేసినట్లు ఆమె పేర్కొంది. పెళ్లి తర్వాత మొదటి సంతానం అనంతరం, ‘పోస్ట్-పార్టమ్ వెయిట్ గైన్’ వల్ల ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కూడా సమాజం నుంచి ఎదురైన విమర్శలు మానసిక వేదనకు గురిచేశాయని తెలిపింది. కానీ రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన తర్వాత తనకు కొత్త సమస్య ఎదురైందని.. తెల్లబడిన తన జుట్టుని, పెరిగిన బరువుని చూసి నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. “ప్రస్తుతం నాకు ఆ నెగటివ్ కామెంట్స్ చూస్తే ఏమీ అనిపించడం లేదు. వాటిపై నేను న్యూట్రల్‌గా ఉన్నాను.” అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.