Reading Time: < 1 minute
Gas Cylinder Ekyc Mandatory Update India

Gas Cylinder Update: గ్యాస్ వినియోగదారులకు పెట్రోలియం కంపెనీలు, ప్రభుత్వం అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో సిలిండర్ బుకింగ్ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటంతో పాటు అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండాలంటే సింపుల్‌ చిట్కా..!

వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా లేదా ఆన్‌లైన్ యాప్స్ సాయంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తోడు, గృహ వినియోగ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు బుకింగ్ వ్యవధిని కూడా సవరించారు. ఇప్పుడు ఒక సిలిండర్ పొందిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం ఉండాలని నిబంధన విధించారు.

Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కఠినమైన నియంత్రణలను అమలులోకి తెచ్చాయి. గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఆస్పత్రులు, విద్యా సంస్థల హాస్టళ్లకు మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని కంపెనీలు స్పష్టం చేశాయి.

ఈ నిర్ణయం వల్ల హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వినియోగదారులు ఈ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గృహ వినియోగదారులు గ్యాస్ నిలిపివేత సమస్య తలెత్తకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.