Reading Time: < 1 minute
India Lpg Crisis Iran Israel War New Booking Rules 2026

LPG Crisis: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా భారత్‌లో LPG కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు(మంగళవారం) పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు.

Read Also: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

మధ్యప్రాచ్యంలో యుద్ధం దేశ ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత, ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్ వంటి దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దేశాల్లోన్ని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఇదే కాకుండా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో ఆసియా దేశాలలో చమురు సంక్షోభం ఏర్పడింది. భారత్ తన LPG అవసరాలలో 62 శాతం దిగుమతి చేసుకుంటుంది.

మరోవైపు దేశంలో సంక్షోభాన్ని నివారించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనేక అత్యవసర చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రిఫైనరీలు ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. దేశీయ వినియోగదారుల కోసం LPG రీఫిల్ బుకింగ్ సైకిల్‌ను మునుపటి 21 రోజుల నుండి 25 రోజులకు పొడిగించారు. దీని ద్వారా బ్లాక్ చేయడం, స్టోర్ చేయడం తగ్గుతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) నుండి ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDలు)తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమల నుండి ప్రాతినిధ్యాలను సమీక్షిస్తుంది, “యోగ్యత, అవసరం మరియు ఉత్పత్తి లభ్యత” ఆధారంగా గ్యాస్ పంపిణీ చేస్తుంది.