Reading Time: < 1 minute
Amit Mishra Wife Garima Tiwari Dowry Harassment Case Allegations

Amit Mishra: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ స్టార్ అమిత్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆయన భార్య గరిమా తివారీ కాన్పూర్ కోర్టును ఆశ్రయించడం క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. మోడల్‌గా పనిచేసిన గరిమాకు 2019లో అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2021 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అమిత్ కుటుంబ సభ్యులు తనను వేధించడం మొదలుపెట్టారని గరిమా ఆరోపించారు.

READ ALSO: Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా

అమిత్ కుటుంబం తనను కారుతో పాటు రూ.10 లక్షల నగదు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు. అమిత్ తరచూ మద్యం తాగి వచ్చి తనను కొట్టేవాడని, కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం పెట్టకుండా గదిలో బంధించి వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఒకసారి తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని గరిమా వెల్లడించారు. ఈ వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, అందుకే న్యాయం కోసం నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు.

అమిత్ మిశ్రా కెరీర్..
42 ఏళ్ల అమిత్ మిశ్రా గతేడాది సెప్టెంబరులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున 22 టెస్టులు (76 వికెట్లు), 36 వన్డేలు (64 వికెట్లు) ఆడారు. ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

READ ALSO: Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!