Reading Time: < 1 minute
Israel Launches New Strikes Lebanon Hezbollah Middle East War

లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌లో బాంబుల మోత మోగుతోంది.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. దీంతో అప్పటి నుంచి ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రస్తుతం భీకర యుద్ధం సాగుతోంది.

ఇదిలా ఉంటే పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆయా దేశాల్లో తీవ్ర కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాణిజ్య సిలిండర్ల సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం