July 9, 2026

Lakshmi Manchu: ‘పుష్ప సినిమాలో ఆ డైలాగ్‌ నాదే’: మంచు లక్ష్మి

Lakshmi Manchu: ‘పుష్ప సినిమాలో ఆ డైలాగ్‌ నాదే’: మంచు లక్ష్మి
Reading Time: < 1 minute
Lakshmi Manchu Claims Pushpa Fire Dialogue Lechindhi Mahila Lokam Event

Lakshmi Manchu: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప, పుష్ప 2. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ లెక్కలను మార్చివేశాయి. అంతటి ఘన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాల్లో ఎన్నో ఐకానిక్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక డైలాగ్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!” – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ డైలాగ్‌ను ‘పుష్ప’ కంటే ముందే తాను ఒక సినిమాలో చెప్పానంటూ తాజాగా నటి మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం.. సీఎం రేవంత్ కీలక హామీలు.!

మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు కూడా ‘పుష్ప’ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “దర్శకుడు సుకుమార్ గారికి నేనొక విషయం చెప్పాలి. ‘ఫ్లవర్‌ కాదు ఫైర్‌’ అని ముందు నేనే చెప్పానండీ. మా సినిమా షూటింగ్ పుష్ప కంటే ముందే పూర్తయింది. కానీ అప్పటికి మా డైలాగ్ బయటకు రాలేదు. పుష్ప టీజర్‌లో ఆ డైలాగ్ వినగానే.. అరే ఇది నా డైలాగ్ కదా అని చాలా ఫీల్ అయ్యాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనన్య నాగళ్ల, శ్రద్ధాదాస్‌, హరితేజ, హేమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా నిర్మాణంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి సినిమాలు నిర్మించే ఆలోచన లేదని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

READ ALSO: Mohabbat Ka Sharbat: వేసవిలో అదిరిపోయే హెల్దీ డ్రింక్! తక్కువ టైంలో.. సింపుల్‌గా పుచ్చకాయతో ఇలా చేయండి..