July 8, 2026

LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..

LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..
Reading Time: < 1 minute
New Lpg Cylinder Booking Rules 21 Days Gap

గ్యాస్ వినియోగదారులకు కంపెనీలు షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో చిన్న మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని 21 రోజులకు పెంచారు. అంటే.. ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత, రెండోది రావాలంటే కనీసం 21 రోజుల గ్యాప్ ఉండాలి. దీని కోసం గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌డేట్ చేశారు.

Also Read:Man cuts off mother-in-law’s nose: అత్త ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ భాగాన్ని చేతిలో పట్టుకొని పరార్..

ఒక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) ఒక్కో కనెక్షన్‌పై మొత్తం 15 సిలిండర్లు మాత్రమే తీసుకోవచ్చు. ఇందులో 12 సిలిండర్లు సబ్సిడీతో వస్తాయి. మిగిలిన 3 సిలిండర్లకు సబ్సిడీ ఉండదు. బుకింగ్ చేసిన 24 గంటల లోపే సిలిండర్ డెలివరీ చేయాలని కంపెనీలు ఆదేశించాయి. దీనివల్ల వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు కాబట్టి కస్టమర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని.. అందరికీ సిలిండర్లు అందుతాయని అధికారులు చెప్పారు.