July 8, 2026

IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Reading Time: < 1 minute
Ind Vs Nz Final T20 World Cup 2026 New Zealand Won Toss And Elected To Bowl

2026 T20 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనున్నది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించగా, భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీం ఇండియా తన టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తుండగా, కివీస్ తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ తమ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అందులో ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ప్లేయింగ్ XIలో ఉన్నాడు. భారత జట్టులో ఎటువంటి మార్పులు లేవు.

ఇండియా ప్లేయింగ్ 11

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11

టిమ్ సీఫెర్ట్ (wk), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (c), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.