July 9, 2026

Flipkart lays off: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్.. వందలాది ఉద్యోగాలు ఖతం..

Flipkart lays off: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్.. వందలాది ఉద్యోగాలు ఖతం..
Reading Time: < 1 minute
Flipkart Lays Off Hundreds Of Employees Performance Review 2026

Flipkart lays off: వరసగా టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఏఐ విస్తరిస్తుండటంతో కంపెనీలు దీనిపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ ద్వారా ఉద్యోగుల్ని రీప్లేస్ చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు, ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునే ప్రయత్నంలో సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ‘‘ఫ్లిప్‌కార్ట్’’ కూడా తన ఉద్యోగుల్ని తొలగించింది. వార్షిక పనితీరు సమీక్ష (Annual Performance Review) ఆధారంగా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 3 నుంచి 4 శాతం మందిని తొలగించనున్నారు. సుమారుగా 300 నుంచి 500 మంది ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టాల్సి వచ్చింది.

Read Also: Iran War: “యురేనియం” టార్గెట్‌గా యూఎస్-ఇజ్రాయిల్ ప్లాన్.. ఇరాన్‌లోకి స్పెషల్ ఫోర్సెస్.!

ఇది సాధారణ పర్పామెన్స్ ఎవాల్యుయేషన్‌లో భాగమే అని చెబుతోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులు, లో-రేటింగ్ పొందిన వారు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్ కోర్ ఆపరేషన్‌లో లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలో 2024లో అప్రైజల్ సైకిల్‌లో కూడా సుమారు 1000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. టెక్, స్టార్టప్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, లాభాలపై దృష్టిపెట్టడంతో ఉద్యోగాలు పోతున్నాయి. లిప్‌కార్ట్ త్వరలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడానికి (IPO) సిద్ధమవుతోంది. ఇది కూడా ఒక కారణంగా ఉంది.