July 9, 2026

Mohammad Amir: మొహమ్మద్ అమీర్ జోస్యం.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?

Mohammad Amir: మొహమ్మద్ అమీర్ జోస్యం.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?
Reading Time: < 1 minute
Mohammad Amir Prediction On India Vs New Zealand Final Goes Viral

టీ20 వరల్డ్ కప్ 2026పై పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆడే మ్యాచ్‌లపై అతడు చేసిన ప్రిడిక్షన్లు అన్ని తలకిందులు అయ్యాయి. భారత్ మ్యాచ్ ఓడిపోతుందని చెప్పిన ప్రతిసారి.. గెలిచింది. దీంతో అమీర్ అంచనాలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అమీర్ అంచనాలు తప్పుతాయని, కప్ టీమిండియాదే అని కామెంట్స్ చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా మొహమ్మద్ అమీర్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. భారత జట్టు పలు మ్యాచ్‌ల్లో ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని, అలాగే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా విండీస్ గెలుస్తుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరిగే పోరులో కూడా భారత్ ఓటమి చెందుతుందని అంచనా వేశాడు. అన్నింటిలో అమీర్ అంచనాలు తప్పాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లపై భారత్ విజయాలు అందుకుంది.

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత్‌కు ఓటమి తప్పదని మొహమ్మద్ అమీర్ తాజాగా వ్యాఖ్యానించాడు. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని చెప్పాడు. అయితే టోర్నమెంట్‌లో ఆయన చేసిన అన్ని అంచనాలు తలక్రిందులయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అమీర్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాపై అతడి చేసిన ప్రిడిక్షన్లు తప్పడంతో.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొస్తుంది అని ఫాన్స్ అంటున్నారు.