Reading Time: < 1 minute
Kamal Haasan Highest Paid Actor In India Kalki Remuneration Details

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ వంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రేసులో అందరినీ దాటేసి కమల్ హాసన్ టాప్‌లో నిలిచారు. ముఖ్యంగా గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించగా, నిర్మాత అశ్వినీదత్ ఏకంగా..

Allso Read : Manasa Varanasi: లివింగ్ రిలేషన్‌పై మానస వారణాసి బోల్డ్ కామెంట్స్!

రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే లెక్క ప్రకారం చూస్తే, కమల్ హాసన్ రోజుకు దాదాపు రూ. 15 కోట్లు (సుమారు 2 మిలియన్ డాలర్లు) పారితోషికంగా అందుకున్నారన్నమాట. ఒక సీనియర్ హీరోకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ ‘కల్కి 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్న ఆయనకు, పార్ట్ 2 కోసం కూడా భారీ మొత్తంలోనే పారితోషికం అందుతోందని టాక్. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కమల్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. ఆయన నిర్మించిన ‘అమరన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ, అటు నటనలోనూ.. ఇటు సంపాదనలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు లోకనాయకుడు.