Reading Time: < 1 minute
Samyuktha The Black Gold Movie Womens Day Special Poster Release

టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త (Samyuktha) ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి చిత్ర బృందం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సంయుక్త ఒక ఫియర్ లెస్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్‌లో సంయుక్త లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : Kamal Haasan:రోజుకు రూ. 15 కోట్లా? ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరో ఎవ్వరో తెలుసా..!

గతంలో ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న సంయుక్త, ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందిస్తున్నారు. ఉమెన్స్ డే రోజున ఒక మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రావడంతో నెటిజన్లు సంయుక్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటున్న సంయుక్తను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.